![]() |
![]() |

కొందరు సెలబ్రిటీలు సోసైటీలో మంచిపేరు తెచ్చుకోవాలని, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కొన్ని మంచి పనులు చేస్తుంటారు. అయితే మరికొందరు అలాంటివేం ఆశించకుండా సహాయం చేస్తుంటారు. అలాంటివారిలో బుల్లితెర, వెండితెర ఫేమస్ యాంకర్ సుమ ఉండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి తాజాగా జ్యోతిరాజ్ చేరింది. ఆటసందీప్ తో కలిసి జ్యోతిరాజ్ 'ఆట' డ్యాన్స్ షోలో కో డ్యాన్సర్ గా చేసి టైటిల్ గెలుచుకుంది.
ఆట డ్యాన్స్ షో టైటిల్ గెలుచుకున్నాక ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్ళు జ్యోతిరాజ్ ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నీతోనే డ్యాన్స్ షోలో భర్త సందీప్ తో కలిసి పాల్గొంది. అందులో వీరిద్దరు కలిసి అదరహో అనిపించేలా డ్యాన్స్ చేసి విజేతలుగా నిలిచారు. ఇక ఈ షో తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆట సందీప్. అయితే సీజన్ సెవెన్ మొదలయ్యే ముందు వీరిద్దరు కలిసి వెళ్తారని అనుకున్నారంతా కానీ ఆట సందీప్ ఒక్కడే వెళ్ళాడు. ఇక బయట ఉన్న జ్యోతి రాజ్ తన భర్త కోసం బాగా ఫైట్ చేసింది.
తన భర్తకి సపోర్ట్ చేయండి అంటూ పోస్ట్ లు చేస్తూ ఎంకరేజ్ చేసింది. ఇక ఆట సందీప్ లోపల ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ తో గొడవ జరిగింది. అయితే మొదట్లో వీరికి గొడవ జరిగిన ఆట సందీప్ ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎవరేంటని ఆట సందీప్, జ్యోతిరాజ్ తెలుసుకున్నారు. హౌస్ లో ప్రియాంక, శోభాశెట్టి, అమర్ దీప్ లు కలిసి గ్రూప్ గా ఆడుతున్న విషయం గ్రహించి రైతుబిడ్డ ప్రశాంత్ జెన్యున్ ప్లేయర్ అని అతనికి సపోర్ట్ గా నిలిచారు. సీజన్ సెవెన్ టైటిల్ గెలిచాక జైలుకెళ్ళిన ప్రశాంత్ కి ఇద్దరు సపోర్ట్ గా నిలిచారు.
ఇక ప్రస్తుతం జ్యోతిరాజ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ ని షేర్ చేసింది. ఇందులో వీధుల్లో, ఆరుబయట, రోడ్ల పక్కన పడుకునే వారికి, ఏమీ లేనివారికి సహాయం చేసింది. ఇది చలికాలం కాబట్టి వారికి కప్పుకోవడానికి దుప్పట్లు ఇచ్చింది జ్యోతిరాజ్. నేనేం గొప్ప పని చేయట్లేదు. నాకు ఉన్నదానిలో ఇలా సహాయం చేస్తున్నానంటూ దుప్పట్లు పంచింది జ్యోతి రాజ్. మీ ఇంట్లో పాత దుప్పట్లు ఉంటే ఇలా చలిలో పడుకునేవారికి, ఏమీ లేనివారికి ఇవ్వండి అంటూ చెప్పుకొచ్చింది జ్యోతిరాజ్. తను చేసే చిన్న సాయం చూసి మరికొంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తారనే ఆశయంతో జ్యోతిరాజ్ చేసిన ఈ పనికి నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కాగా మానవత్వాన్ని చాటుకున్న జ్యోతిరాజ్ చేసిన ఈ సాయాన్ని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |